కార్యాలయంలో పనిచేసే మహిళలకు మాతృత్వం ఎంతమాత్రమూ అవమానభారంగా మారకూడదని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రసూతి సెలవుల నుంచి తిరిగొచ్చిన మహిళా చార్టర్డ్ అకౌంటెంట్‌ను మేనేజర్ స్థాయి నుంచి క్లరికల్ విధులకు తగ్గించినందుకు గాను సదరు ప్రైవేట్ సంస్థకు రూ. 10 లక్షల నష్టపరిహారం విధించింది. ప్రసూతి సెలవుల సమయంలో పొందే రక్షణ కేవలం ఉద్యోగ భద్రతకే కాకుండా వృత్తిపరమైన హోదా, ప్రమోషన్లకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసిన కోర్టు.. ఆరు నెలల్లోగా ఉద్యోగినుల పునరాగమనానికి సంబంధించి సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మెటర్నిటీ సెలవుల తర్వాత ఆఫీసుకెళ్తే.. మేనేజర్ నుంచి క్లరికల్ ఉద్యోగం: ప్రైవేట్ సంస్థకు రూ.10 లక్షల జరిమానా!
RELATED ARTICLES


