ఆగస్టు నెలలో భారతీయ ఈక్విటీ మార్కెట్ విభాగాలలో తీవ్ర వ్యత్యాసం కనిపించింది. లార్జ్‌క్యాప్ సూచీలు నష్టాల్లో కూరుకుపోగా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాలు గెలుపు బాట పట్టాయి. మిడ్‌క్యాప్ సూచీ ఏకంగా ఆల్‌టైమ్ హై రికార్డు సాధించగా, దీర్ఘకాలిక రాబడుల్లోనూ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది.


