ప్రయాణానికి కొన్ని రోజుల ముందే ఆన్లైన్లో రైలు టికెట్ బుక్ చేసుకున్న ఓ మహిళను.. ఖచ్చితమైన రిజర్వేషన్ ఉన్నప్పటికీ టీటీఈ బలంవంతంగా రైల్లోంచి దంపేశారు. ముఖ్యంగా ఆర్పీఎఫ్ సిబ్బంది చేత అరెస్ట్ చేయించగా.. ఆమె తనకు జరిగిన అన్యాయంపై మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. ఈక్రమంలోనే సుదీర్ఘ విచారణ జరిపిన కమిషన్.. టీటీఈ, ఆర్పీఎఫ్ సిబ్బంది తీరు అనాగరికంగా ఉందని, మహిళను మానసిక క్షోభకు గురి చేసినందుకు గాను ఆమెకు రూ.2 లక్షల నష్టపరిహారం అందించాలని భారతీయ రైల్వే శాఖకు సూచించింది. నెల రోజుల్లోగానే ఆ డబ్బు మొత్తాన్ని ఆమెకు అందించాలని వివరించింది.
అర్ధరాత్రి మహిళను రైలు నుంచి దించేసినందుకు.. రైల్వే శాఖకు రూ.2 లక్షల భారీ జరిమానా!
RELATED ARTICLES


