స్మార్ట్ఫోన్ వినియోగదారుల కోసం గూగుల్ ‘సెప్టెంబర్ ఆండ్రాయిడ్ డ్రాప్’ అప్డేట్ను విడుదల చేసింది. వస్తువుల ఆచూకీ తెలిపే జెమిని ఏఐ, ప్రయాణాల్లో కళ్లు తిరగకుండా చూసే మోషన్ అసిస్ట్, దృష్టి లోపం ఉన్నవారి కోసం గైడెడ్ విజన్ వంటి పలు కీలక ఫీచర్లను ఇందులో తీసుకొచ్చారు.


