పాకిస్థాన్‌లో అపహరణకు గురై బలవంతంగా ఇస్లాం మతంలోకి మారిన ఒక హిందూ యువతికి స్థానిక న్యాయస్థానంలో ఊరట లభించింది. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన 21 ఏళ్ల శిరిమాతి రీటాను కిడ్నాప్ చేసిన దుండగులు పంజాబ్‌లోని గుర్జాన్వాలాకు తరలించి.. బలవంతంగా మతమార్పిడి చేయించారు. అక్కడితే ఆగకుండా అప్పటికే పెళ్లయిన ఓ ముస్లిం యువకుడితో బలవంతంగా వివాహం జరిపించారు. ఈ దారుణంపై విచారణ జరిపిన పోలీసులు బాధితురాలిని రక్షించి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆమెను వెంటనే తిరిగి కన్నవారి వద్దకు పంపాలని ఆదేశిస్తూ కీలక తీర్పు ఇచ్చారు.
పాకిస్థాన్‌లో హిందూ యువతిని కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చి.. పెళ్లైన వాడికిచ్చి వివాహం జరిపించిన కిడ్నాపర్లు.. చివరకు?
RELATED ARTICLES


