HomeAndhra Pradeshఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నాటికి ప్రతి బస్టాండ్‌కు ఎలక్ట్రిక్ బస్సులు

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నాటికి ప్రతి బస్టాండ్‌కు ఎలక్ట్రిక్ బస్సులు

రాష్ట్రంలో డిసెంబర్ నాటికి మొత్తం 1050 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని ఆర్టీసీ ఛైర్మన్ నారాయణరావు వెల్లడించారు. 350 అక్టోబర్ చివరికి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో ప్రతి డిపోలోనూ ఎలక్ట్రిక్ బస్సు సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు. ప్రయాణికుల ఇబ్బందులకు ఎలక్ట్రిక్ బస్సులు సరైన పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తానికి దశలవారీగా 5500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని కూటమి ప్రభుత్వం ఆలోచనలో ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో రానున్న కాలంలో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments