HomeAndhra Pradeshహైదరాబాద్‌కి ఐటీ.. అమరావతికి క్వాంటం వ్యాలీ: మంత్రి నారాయణ

హైదరాబాద్‌కి ఐటీ.. అమరావతికి క్వాంటం వ్యాలీ: మంత్రి నారాయణ

అమరావతిని క్వాంటం వ్యాలీ హబ్‌గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతిలో పర్యటించిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం టెక్నాలజీని డెవలప్ చేస్తామని తెలిపారు. అమరావతిలోని క్వాంటం వ్యాలీ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఐబీఎం, టీసీఎస్ సంస్థల భాగస్వామ్యంతో క్వాంటం ల్యాబ్ నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. 45,216 చదరపు అడుగుల్లో క్వాంటం వ్యాలీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments