హైదరాబాద్లో రహస్య సొరంగం వెలుగులోకి రావడం ఆసక్తిని రేకెత్తించింది. కుతుబ్షాహీ సమాధుల వద్ద అక్రమ తవ్వకాలు జరగ్గా.. ఈ సొరంగం బయటికి వచ్చింది. అయితే ఈ నిర్మాణం కుతుబ్షాహీల కాలం నాటిదేనా అని అనుమానిస్తున్నారు. గోల్కొండ నుంచి చార్మినార్ వరకు ఉన్నట్లు ప్రచారంలో ఉన్న రహస్య మార్గంతో దీనికి సంబంధం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పురావస్తు నిపుణుల పరిశీలన తర్వాతే ఈ సొరంగం అసలు విషయం వెలుగులోకి రానుంది.


