కొండా సుస్మిత చుట్టూ కొనసాగుతున్న వివాదంపై కొండా సురేఖ మరోసారి మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఇప్పటికే సమాధానం ఇచ్చానని తేల్చి చెప్పారు. కమిటీకి అన్ని విషయాలు వివరించానని.. కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు మాట్లాడతానని వెల్లడించారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని.. తనకు సంబంధం లేదని ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ వివరణ ఇచ్చారు.


