HomeVideosప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ కోణం.. ఆ ఒక్క మాటతో దొరికిపోయారు

ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ కోణం.. ఆ ఒక్క మాటతో దొరికిపోయారు

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పాఠాలు చెప్పిన ఉపాధ్యాయురాలిని ఇద్దరు పదో తరగతి విద్యార్థులు దోపిడీ కోసం పక్కా ప్లాన్‌తో కత్తితో పొడిచి హత్య చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. హత్యకు ముందు రూపారెడ్డి చివరిగా ఫోన్‌లో “బాబు” అని పలికిన మాటనే కీలక ఆధారంగా చేసుకుని, 70కి పైగా సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.1.54 లక్షల నగదు, మృతురాలి ఐఫోన్, కత్తి, గ్లౌజులను స్వాధీనం చేసుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments