డీఎస్సీ విషయంలో చోటుచేసుకున్న అవకతవకలపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటూ వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ నడుపుతున్నారని.. కౌన్సిల్లో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎవ్వరూ లేకుండా తండ్రీకొడుకులు బ్యాటింగ్ చేస్తున్నారంటూ విమర్శించారు. డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టే కౌన్సిల్లో చర్చకు ఒప్పుకోలేదని.. డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ – పరీక్ష నిర్వహణ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు లోకేశ్ స్వయంగా అంగీకరించారని.. మేం లేవనెత్తిన అంశం కూడా ఇదే అని జగన్ అన్నారు.
బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండానే తండ్రీకొడుకుల బ్యాటింగ్.. చంద్రబాబు, లోకేశ్‌పై జగన్ ఫైర్
RELATED ARTICLES


