భారత్‌తో ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు ఆతిథ్య శ్రీలంక జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గాలే టెస్టులో 165 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిన లంకకు, గాయాల రూపంలో ప్రధాన ఆటగాళ్లు దూరమవ్వడం పెద్ద లోటుగా మారింది. కీలక బ్యాటర్లు కుశాల్ మెండిస్, దినేష్ చండీమాల్ కొలంబో టెస్టుకు పూర్తిగా దూరమయ్యారు. ఓపెనర్ పతుమ్ నిస్సంక ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి.


