HomeVideosతిరుపతి ఘాట్ రోడ్డులో చిరుత పులి

తిరుపతి ఘాట్ రోడ్డులో చిరుత పులి

తిరుపతి జిల్లా చిట్వేలు – రాపూర్ ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. చిట్వేలు నుంచి పెంచలకోన వైపు వెళ్తున్న ప్రయాణికులు రాత్రి వేళ మూడో మలుపు వద్ద చిరుత సంచరిస్తుండటాన్ని గమనించారు. ప్రస్తుతం పెంచలకోనలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బైక్‌లపై వెళ్లే భక్తులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘాట్ రోడ్డులో వెళ్లేవారు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ప్రయాణించాలని అటవీ శాఖ (ఫారెస్ట్) అధికారులు హెచ్చరించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments