సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు వెళ్లకుండా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీశ్ రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే అప్రకటిత ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.



