ఈ ఏడాది జూన్ 26వ తేదీన చీమకుర్తిలో గ్రానైట్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రమాదానికి క్వారీ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేనట్టు ఒక అనుకూల నివేదిక పొందేందుకు యజమానులు గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్‌ను సంప్రదించారు. ఈ మేరకు గతంలో రూ. లక్ష తీసుకున్న ఆయన.. ఒంగోలులో మరో రూ. 2 లక్షలు తీసుకుంటుండగా సీబీఐ మాటు వేసి పక్కా ప్లాన్‌తో రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకుంది. శివశంకర్‌తో పాటు క్వారీ యజమాని వెంకట సురేష్, మధ్యవర్తి సుభాస్కర్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు.
ఒంగోలులో పక్కా ప్లాన్‌తో సీబీఐ రైడ్.. గ్రానైట్ వ్యవహారంలో లంచం తీసుకుంటున్న, లంచం ఇస్తున్న ఇద్దరూ అరెస్ట్
RELATED ARTICLES


