
వాషింగ్టన్:
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. అధికార రిపబ్లికన్ పార్టీ సెనేట్, హౌస్ లో మెజారిటీ కోల్పోయింది.435 సీట్లున్న హౌస్ లో డెమోక్రాట్లు మ్యాజిక్ ఫిగర్ (218) ను దాటేశారు. రిపబ్లికన్లు 124 చోట్ల లీడ్ లో ఉన్నారు.100 సీట్లున్న సెనేట్ లో డెమోక్రాట్ల బలం 53కు పెరగ్గా, రిపబ్లికన్ల సీట్లు 41కి పడిపోయాయి.గవర్నర్లుగా 24 చోట్ల డెమోక్రాట్లు, 18 చోట్ల రిపబ్లికన్లు లీడ్ లో ఉన్నట్లు ఫలితాలు వెలువడుతున్నాయి.


