HomeHeadlinesధర్నా చౌక్‌లలోనూ నిరసనలకు కాలపరిమితి ఉండాల్సిందే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ధర్నా చౌక్‌లలోనూ నిరసనలకు కాలపరిమితి ఉండాల్సిందే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా కోరుతూ ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలతో దేశ రాజధాని ఢిల్లీలో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో వర్తకుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆందోళనల కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. కీలక వ్యాఖ్యలు చేసింది. ధర్నా చౌక్‌లో నిరసనల పేరుతో ఏ ఒక్కరూ నిరంతరం ఆక్రమించుకోవడం కుదరదని సీజేఐ ధర్మాసనం తేల్చి చెప్పింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments