బాలీవుడ్ ప్రముఖ యాక్షన్ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఇటీవల కాల్పులు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటన సృష్టించిన భయాందోళనల నుంచి హిందీ చిత్ర పరిశ్రమ ఇంకా తేరుకోకముందే.. ఆ ముఠా మరో ప్రముఖ నటుడికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రముఖ నటుడు, నిర్మాత తుషార్ కపూర్‌కు ఆ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్ పేరుతో బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. తమకు వెంటనే రూ. 5 కోట్లు చెల్లించాలని, లేకపోతే ప్రాణాలు తీస్తామని తీవ్రస్థాయిలో అతడు హెచ్చరించగా తుషార్ కపూర్ ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
“రూ.5 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం”: మరో నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
RELATED ARTICLES


