
ధర్మవరం:
శ్రీ సత్యసాయి జిల్లా విద్యుత్ మీటర్ రీడర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ SPDCL అధ్యక్షులు మరియు AITUC జిల్లా నాయకులు ఆర్. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్మవరం కరెంట్ ఆఫీస్ నందు SAO బాలాజీ వెంకటేష్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మీటర్ రీడర్స్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సంస్థను నమ్ముకుని విధులు నిర్వహిస్తున్నామని, అయితే ప్రస్తుత కాంట్రాక్టర్ వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.యాజమాన్యం ఆదేశాల ప్రకారం ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ఆగస్టు నెలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 15 మంది మీటర్ రీడర్స్ కు ఇప్పటికీ జీతాలు చెల్లించలేదని, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు జిల్లా వ్యాప్తంగా జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.మీటర్ రీడింగ్ కు అవసరమైన పేపర్ రోల్స్ సరిపడా ఇవ్వడం లేదని, దాదాపు రెండు నెలలుగా రిపేర్ లో ఉన్న ప్రింటర్లను మరమ్మతులు చేసి ఇవ్వడం లేదని, దీనివల్ల వినియోగదారులకు బిల్లులు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.AE లాగిన్ లో సర్వీసుల మార్పులు 8 నుంచి 10 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని, దీనివల్ల వినియోగదారులకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రధాన డిమాండ్లు:సెప్టెంబర్, అక్టోబర్ పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలిఆగస్టు నెలలో జీతాలు అందని 15 మందికి వెంటనే చెల్లించాలిప్రతి నెల 5వ తేదీలోపు క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలిసరిపడా పేపర్ రోల్స్ అందించాలిరిపేర్ లో ఉన్న ప్రింటర్లను మరమ్మతులు చేసి ఇవ్వాలిAE లాగిన్ లో పెండింగ్ సర్వీసులను వెంటనే పరిష్కరించాలిఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బి.సి. దస్తగిరి, ఆదర్శ్ కుమార్, జగదీష్ తదితర మీటర్ రీడర్స్ పాల్గొన్నారు.


