నిర్మల్ జిల్లాకు చెందిన దూస చేతన్ అనే యువకుడు 21 ఏళ్ల వయసులోనే ఏడాదికి రూ.59 లక్షల ప్యాకేజీతో జొమాటో సంస్థలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్‌గా ఎంపికయ్యారు. ఇండోర్ ఐఐటీలో మ్యాథమెటికల్ కంప్యూటింగ్ చివరి సంవత్సరం చదువుతున్న చేతన్‌కు ప్రాంగణ నియామకాల్లో ఈ అవకాశం లభించింది. గతంలో జరిగిన నియామక ప్రక్రియలో నిరాశ ఎదురైనా కుంగిపోకుండా.. తన లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగారు. పట్టుదలతో సాధించిన తాజా విజయం ఎందరో విద్యార్థులకు స్ఫూర్తినిస్తోంది.


