న్యూజిలాండ్తో చివరి టీ20లో భారత బౌలర్లు తేలిపోయారు. 192 పరుగుల లక్ష్యాన్నికాపాడటంలో ఏమాత్రం పోరాడలేకపోయారు. దీంతో కివీస్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటికే భారత్కు సిరీస్ను కోల్పోయిన న్యూజిలాండ్.. ఈ విజయంతో ఓటమి అంతరాన్ని 2-3కు తగ్గించింది. 93 రన్స్ చేసిన కివీస్ ఓపెనర్ సిఫెర్ట్ను నితీశ్ కుమార్ రెడ్డి బౌల్డ్ చేయడంతో.. సెంచరీ చేయకుండానే నిరాశగా వెనుదిరిగాడు. డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ దూకుడుగా ఆడారు.


