ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ SIR ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ మీటింగ్‌లో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటర్ల లిస్ట్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్ల జాబితాల నుంచి కోట్లాది మంది హిందువుల పేర్లు తొలగిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ఓటర్ల జాబితా నుంచి 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు తొలగిపోయాయని పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లందరూ జాబితాలో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
ఓటరు జాబితా నుంచి 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు గల్లంతు.. SIRపై యోగి ఆదిత్యనాథ్ సంచలన కామెంట్స్
RELATED ARTICLES


