న్యూజిలాండ్తో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సృష్టించారు. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 100 కంటే ఎక్కువ పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంలో అత్యధిక రన్ రేట్ (18.13) నమోదు చేసిన జోడీగా చరిత్రకెక్కారు. 2025లో ఇంగ్లండ్ జోడీ జోస్ బట్లర్ – ఫిల్ సాల్ట్ (16.08 రన్ రేట్) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు.


