లాహోర్ వేదికగా జరిగిన ట్రై-సిరీస్ వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ 1 వికెట్ తేడాతో ఉత్కంఠ విజయాన్ని సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 152 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షాదాబ్ ఖాన్ (96 బంతుల్లో 113 నాటౌట్) హారీస్ రవూఫ్ (7*)తో కలిసి 10వ వికెట్‌కు 89 పరుగులు జోడించి జట్టును ఊహించని రీతిలో గెలిపించాడు.


