జింబాబ్వే మహిళల జట్టుతో వడోదరా వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49.5 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో శ్రీ చరణి 4 వికెట్లు, క్రాంతి గౌడ్ 3 వికెట్లతో మెరిశారు. అనంతరం 198 పరుగుల సులువైన లక్ష్యాన్ని భారత్ కేవలం 27.1 ఓవర్లలో ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. ప్రతీకా రావల్ (100 నాటౌట్), షెఫాలీ వర్మ (64 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించారు.


