భారత మహిళా క్రికెటర్, తెలుగు అమ్మాయి ఎస్. మేఘన 30 ఏళ్ల వయసులో అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన మేఘన, మొత్తం 3 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడింది. అలాగే మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించింది. భవిష్యత్తులో యువ ఆటగాళ్లకు మెంటర్‌గా సేవలందిస్తానని ఆమె తెలిపింది.


