HomeEntertainmentదర్శకుడిగా మారిన 'ది గర్ల్‌ఫ్రెండ్‌' అసిస్టెంట్ డైరెక్టర్‌.... అంతుచిక్కని సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో మూవీ

దర్శకుడిగా మారిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ అసిస్టెంట్ డైరెక్టర్‌…. అంతుచిక్కని సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో మూవీ

నేషనల్ క్రష్ రష్మిక మందానా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన శశాంక్‌ దువ్వూరు ఇప్పుడు పూర్తిస్థాయి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డీఆర్‌ఆర్ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ ప్రవాస వైద్యుడు డాక్టర్‌ దామోదర్‌ నేరేళ్ల తమ ‘ప్రొడక్షన్ నంబర్‌ 1’ మూవీ తాజాగా మొదలైంది. రవి శివతేజ, భాస్కర్‌ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల, నేహా పఠాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలకు వినూత్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments