ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత వన్డే మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 430 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సంచలనం సృష్టించింది. లిస్ట్-ఏ, వన్డే క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యధిక విజయవంతమైన రన్ ఛేజింగ్‌గా రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి మొత్తం 859 పరుగులు సాధించగా, వన్డే చరిత్రలో ఇది రెండో అత్యధిక మ్యాచ్ అగ్రిగేట్గా నిలిచింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన క్రికెట్ మజాను అందించింది.


