HomeAndhra Pradeshరోజురోజుకూ ముదురుతున్న కొటియా వివాదం.. సరిహద్దులో ఏపీ పంచాయతీ ఎన్నికల సెగ..!

రోజురోజుకూ ముదురుతున్న కొటియా వివాదం.. సరిహద్దులో ఏపీ పంచాయతీ ఎన్నికల సెగ..!

కొటియా ప్రాంతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంపై ఒడిశా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు కొటియా గ్రామాలను మూడు ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించి పోలింగ్, ఓట్ల లెక్కింపు షెడ్యూల్‌ని రిలీజ్ చేశారు. దీంతో ఒడిశా ప్రభుత్వం రంగంలోకి దిగి.. ఈ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ మేరకు చట్టపరమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించక తప్పడం లేదని మంత్రి సురేష్ పూజారి చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ బీజూ జనతా దళ్ కూడా రంగంలోకి దిగి దీనిపై నిరసన తెలుపుతుంది. ఈ చర్యను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments