చేతికి శాలరీ అందగానే ఎవరికైనా సంతోషమే. నెల మొదట్లో జీతం చేతికి రాగానే సంబరం.. కానీ పది, పదిహేను రోజులు గడిచేసరికి పర్సు ఖాళీ, అకౌంట్ బ్యాలెన్స్ నిల్. ఆ తర్వాత అప్పుల మయం. ఇలాంటి పరిస్థితి చాలా మందికి ఎదురవుతోంది. ఈ పరిస్థితి మీకూ ఎదురవుతోందా? పెరిగిన నిత్యావసరాల ధరలు, ఆన్లైన్ షాపింగ్ డీల్స్, క్షణాల్లో చెల్లింపులు జరిపే యూపీఐల కాలంలో డబ్బు పొదుపు చేయడం నిజంగానే ఒక సవాలుగా మారింది.
అయితే, ఈ సమస్యను ఎదుర్కోవడానికి జపాన్ ప్రజలు శతాబ్ధాలుగా వాడుతున్న ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. అదే ‘కాకేబో’ (Kakeibo) పద్ధతి. ఈ సులువైన ఫార్ములాతో మీ నెలవారీ ఖర్చుల్ని అదుపులో ఉంచుకుంటూనే అనుకున్నంత డబ్బును పొదుపు చేసుకోవచ్చు. ఇంతకీ కాకేబో పద్ధతి అంటే ఏంటి, దీన్ని ఎలా పాటించాలి?


