కాఫీ పొడి.. దీనిని తయారుచేసుకుని తాగడం కంటే దాని వాసనల్ని ఎంజాయ్ చేయడం చాలా మందికి ఇష్టం. అయితే, తీసుకొచ్చిన కొన్నిరోజుల వరకూ కాఫీ పొడి తాజాగానే ఉంటుంది. కానీ, కొన్నిరోజులు గడిచాక గడ్డకట్టడం లేదా సువాసనలు తగ్గుతుంది. దీనికి కారణం అది గడ్డకట్టడం. గడ్డకడితే ఏ మాత్రం వాసనలు రావు. పైగా రుచి కూడా సరిగ్గా ఉండదు. అలా కాకుండా ఎన్నిరోజులైనా ఫ్రెష్‌గా ఉండే కొత్తగా కొన్నప్పుడు ఉన్న అరోమానే ఉండాలంటే సరైన చిట్కాలు ఫాలో అవ్వాలి. దీంతో కాఫీ పొడి రంగు మారకుండా ఎక్కువరోజులు తాజాగా ఉంటుంది. మీరు కాఫీ తాగిన ప్రతిసారి మంచి అనుభూతి కలుగుతుంది.


