జమ్మూ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై చర్చకు వచ్చేలా దాయాది పాకిస్థాన్ చేయని ప్రయత్నం లేదు. తాజాగా, ఇస్లామిక్ దేశాల కూటమి తీర్మానంలో జమ్మూ కశ్మీర్ ప్రస్తావన తేవడంపై భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది తమ అంతర్గత విషయమని, ఇందులో వేరేవారి జోక్యాన్ని ఏమాత్రం సహించబోమని పునరుద్ఘాటించింది. ఇదంతా పాకిస్థాన్ చేస్తున్న కుట్ర అని, ఆ దేశంలో జరుగుతోన్న మానవహక్కుల ఉల్లంఘన, మైనార్టీలపై హింసను కప్పిపుచ్చుకోడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని మండిపడింది.


