Tata Sons AoA Changes: టాటా సన్స్‌ను ఆర్బీఐ తప్పనిసరిగా స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ చేయాలని చెబుతుంటే, టాటా ట్రస్ట్స్ మాత్రం దానికి ససేమిరా అంటోంది. లిస్టింగ్ నుంచి తప్పించుకునేందుకు దారులు వెతుక్కుంటోంది. ఇప్పుడు ఆ లిస్టింగ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌ను (AOA) సమీక్షిస్తోంది. బోర్డ్ నియామకాలు, స్వతంత్ర డైరెక్టర్లు, టాటా ట్రస్ట్స్‌కు ఉన్న ప్రత్యేక ఓటింగ్ హక్కులపై మార్పులు పరిశీలనలో ఉన్నాయి.


