భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయడం ఎవరివల్లా కాదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు. గాయం కారణంగా పాండ్యా జట్టుకు దూరంగా ఉండటంతో శివం దూబే, నితీశ్ కుమార్ రెడ్డిలను బరిలోకి దించుతున్నప్పటికీ, ఆ స్థాయిని ఎవరూ అందుకోలేకపోతున్నారని వివరించాడు. పాండ్యా లేని లోటును భర్తీ చేయడానికి విభిన్నమైన వ్యూహాలతో నమన్ ధీర్ వంటి ఆటగాళ్లను ఉపయోగించుకోవాలని సూచించాడు. పాండ్యా ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు.


