తిరుమల కొండపై వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇందులో భాగంగా వెంకన్న గొడుగు ప్రదర్శన అత్యంత వైభవంగా జరిగింది. ఎప్పటి లాగానే కృష్ణగిరి జిల్లా పచ్చపనట్టి గ్రామానికి చెందిన కుటుంబం ఈ వెంకన్న గొడుగు ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. గొడుగులను స్వామివారి దగ్గరకు తీసుకెళ్లే క్రమంలో కళాకారులు చేసే విన్యాసాలు ఎంతో అద్భుతంగా సాగాయి. 1982 నుంచి ఇది ఒక సాంస్కృతిక వారసత్వంగా సాగుతూ వస్తుంది.
అంబరాన్ని తాకే సంబరంగా ‘వెంకన్న గొడుగు’.. ఏళ్ల నాటి సాంస్కృతిక వారసత్వం
RELATED ARTICLES


