Mumbai Commercial Property: జపాన్కు చెందిన సుమిటొమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC) ముంబైలోని బాంద్రా- కుర్లా కాంప్లెక్స్లో పెద్ద మొత్తంలో ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. 49820 చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న ఈ ఒప్పందం మొత్తం అద్దె విలువ రూ. 189 కోట్లు. నెలలవారీ అద్దె సుమారు రూ. 3.46 కోట్లు కాగా, 2027 జూన్ నుంచి అద్దె చెల్లింపులు ప్రారంభం కానున్నాయి.


