Indian Stock Market: భారత స్టాక్ మార్కెట్లు కొంత కాలంగా తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాస్త కోలుకున్నా విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని పెద్ద మొత్తంలో ఉపసంహరించుకుంటున్నారు. అక్టోబర్ నెలలోనే భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) ఇప్పటివరకు ఏకంగా రూ. 52100 కోట్లను వెనక్కి తీసుకున్నారు. క్రూడాయిల్ ధరలు పెరగడం, అమెరికా బాండ్ ఈల్డ్స్, డాలర్ పుంజుకోవడం ఇందుకు కారణమయ్యాయి.


