Cancer Drug Prices India: సుదీర్ఘ కాలం వేధించే రోగాల్లో క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది. అంత సులభంగా ఈ రోగం నయం కాదు. చికిత్సకు ఖర్చు కూడా ఎక్కువే. దీర్ఘకాలం మందులు వాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించే దిశగా కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 137 రకాల క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్ను 30 శాతానికి పరిమితం చేయడంతో కొన్ని మందుల రిటైల్ ధరలు 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.


