బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్కు చెందిన బంగ్లాలో అనుమతులు లేని నిర్మాణాలపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు చర్యలు తీసుకున్నారు. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఈ బంగ్లాలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన కొన్ని నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. గతంలోనే సెప్టెంబర్ 10న బీఎంసీ నుంచి నోటీసులు ఇచ్చినా నిర్మాణాలు కొనసాగడంతో అధికారులు ఈ చర్యలకు దిగారని తెలుస్తోంది. అగ్ర నటుడి బంగ్లాలోనే ఈ పరిణామం జరగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ajay devgn: బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్కు షాక్.. జుహు బంగ్లాలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
RELATED ARTICLES


