ఐపీఎల్ 2027 సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక ప్రకటన చేసింది. తమ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం (అక్టోబర్ 17, 2026) అధికారికంగా వెల్లడించింది. ముంబై ఇండియన్స్తో పదేళ్ల పాటు కొనసాగిన జయవర్దనే.. తన హయాంలో జట్టుకు 2017, 2019, 2020 టైటిల్స్ అందించాడు. త్వరలో ప్లేయర్ రిటెన్షన్ డెడ్లైన్ సమీపిస్తుండటంతో ముంబై మేనేజ్మెంట్ కొత్త కోచ్ కోసం అన్వేషణ మొదలుపెట్టింది.


