భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి అంతర్జాతీయ స్థాయిని లక్ష్యంగా చేసుకుని ఐమ్యాక్స్ ఫార్మాట్లో రూపుదిద్దుకుంటున్న రెండు భారీ విజువల్ వండర్స్ ‘రామాయణ’, ‘వారణాసి’. నితీష్ తివారి దర్శకత్వంలో వస్తున్న ‘రామాయణ’ నుంచి విడుదలైన సరికొత్త ట్రైలర్ తన భారీ విజువల్స్, గ్రాండియర్‌తో సినీ లోకాన్ని విస్మయానికి గురిచేసింది. దీంతో రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ విజువల్ ప్రమాణాలపై సినీ అభిమానుల్లో తీవ్ర చర్చ మొదలైంది. ‘రామాయణ’ ట్రైలర్ సృష్టించిన విజువల్ ఇంపాక్ట్‌ను జక్కన్న తన మార్క్ మేకింగ్‌తో ఎలా అధిగమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ‘వారణాసి’ నుంచి అధికారిక విజువల్స్ వెలువడితేనే ఈ మెగా సమరంపై మరింత క్లారిటీ రానుంది.
Ramayana Trailer: ‘వారణాసి’ గ్రాండియర్‌కు ‘రామాయణ’ సవాలు.. గ్లోబల్ ఐమ్యాక్స్ వేదికపై భారతీయ సినిమాల సమరం!
RELATED ARTICLES


