భార్యభర్తల బంధం ఎంతో ప్రత్యేకమైంది. ఈ బంధం నిలుపుకోవడానికి భార్యభర్తలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫర్వాలేదు. చిన్న చిన్న గొడవల్ని పెద్ద వాటిగా మార్చుకోని విడిపోవడం కరెక్ట్ కాదు. ఈ మధ్య కాలంలో మనం స్లీప్ డివోర్స్ గురించి విన్నాం. నిద్రలేమి, గురక లేదా ఒకరి నిద్ర అలవాట్లు మరొకరికి ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి ఆలుమగలు వేర్వేరు గదుల్లో నిద్రించే వారు. అయితే, ఆ కాన్సెప్ట్ ఇప్పుడు పాతబడింది. ప్రసుత్తం ఫుడ్ డివోర్స్ (Food Divorce) అనే సరికొత్త లైఫ్‌స్టైల్ ట్రెండ్ ఇప్పుడు వైరల్ అయింది.
పేరులో డివోర్స్ (విడాకులు) అనే పదం ఉన్నంత మాత్రాన భయపడాల్సిన లేదా నెగెటివ్‌గా ఈ ట్రెండ్‌ను చూడాల్సిన పనిలేదు. దీనికి వివాహ బంధం ముగియడంతో ఎలాంటి సంబంధం లేదు. ఒకే ఇంట్లో కలిసి ఉంటూనే ఫుడ్ విషయంలో ఒకరి ఇష్టాల్ని మరొకరిపై రుద్ధకుండా ఎవరిడైట్, ఆరోగ్యం, సమయాలకు అనుగుణంగా వారు ఆహారాన్ని వండుకోవడం, తినడాన్నే ఫుడ్ డివోర్స్ అంటారు.


