HomeLifestyleDeep Vein Thrombosis: ఒకే కాలులో వాపు, పిక్కల్లో తీవ్రమైన నొప్పా? మీ శరీరం ఎదుర్కొంటున్న...

Deep Vein Thrombosis: ఒకే కాలులో వాపు, పిక్కల్లో తీవ్రమైన నొప్పా? మీ శరీరం ఎదుర్కొంటున్న ముప్పు ఏంటంటే

ఒకే కాలులో వాపు వచ్చిందా? రెండో కాలు మీద పోలీస్తే నొప్పి ఎక్కువగా ఉందా? పిక్క లేదా తొడ భాగంలో నిరంతరం నొప్పి ఉందా? ఈ లక్షణాల్ని లైట్ తీసుకోండి. మీరు డీప్ వెయిన్ థ్రాంబోసిస్‌తో బాధపడుతుండొచ్చు. శరీరంలోని లోతైన సిరల్లో సాధారణంగా కాళ్లలో రక్తం గడ్డకట్టడాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (Deep Vein Thrombosis – DVT) అంటారు. ఇది సాధారణ సమస్య కాదు.. తీవ్రమైంది. ఎందుకంటే కాళ్లలో గడ్డకట్టిన రక్తం విడిపోయి, రక్తప్రవాహం ద్వారా ఊపిరితిత్తులకు చేరే ప్రమాదం ఉంది.

దీన్నే వైద్య పరిభాషలో పల్మనరీ ఎంబోలిజం (Pulmonary Embolism) అంటారు. ఇది ప్రాణాంతకమైన పరిస్థితి. అందుకే ప్రారంభ లక్షణాల్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం అత్యంత ముఖ్యం. అసలు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ప్రధాన హెచ్చరిక సంకేతాలేంటి? నిశ్శబ్ద లక్షణాలు, వైద్య పరీక్షలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి పూర్తి వివరాల్ని డా. రేవంత్ బొడ్డు (కన్సల్టెంట్ – హెమటాలజీ, హెమటో-ఆంకాలజీ & బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) అందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments