మేకప్ వేసుకున్నామంటే వేసుకున్నాం అన్నట్లుగా ఉంటే ఏం బాగుంటుంది. వేసుకున్న మేకప్ అకేషన్ అయ్యేంతవరకూ అందంగా కనిపించాలంటే ముందుగా కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. సాధారణంగా పార్టీలు, ఫంక్షన్స్‌కి వెళ్లినప్పుడు అంతగా అలసిపోం. కాబట్టి, మేకప్ ఎక్కువసేపు ఫ్రెష్‌గానే ఉంటుంది. కానీ, పెళ్ళిళ్లో డ్యాన్స్, కాలేజీలో పార్టీలు, బతుకమ్మ, దాండియా, హోలీ వంటి పండుగల్లో డ్యాన్స్‌లు చేస్తుంటాం. అలాంటప్పుడు ఎక్కువగా చెమట పట్టేసి మేకప్ మొత్తం కారిపోతుంటుంది. అలా కాకుండా మేకప్ వేసుకున్నప్పుడు ఎలా అయితే ఉన్నామో ఆ డ్యాన్సులు అయిపోయేవరకూ కూడా అలానే ఉండాలంటే మేకప్‌కి ముందు, తర్వాత కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అప్పుడే మేకప్ చాలా సేపటి వరకూ చెక్కు చెదరకుండా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో చూసేయండి.


