హైదరాబాద్లో నిర్మిస్తున్న మీనాక్షి ఎలీసియా భవనంపై హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. 35 అంతస్తుల నిర్మాణం చారిత్రక మొజాంజాహీ మార్కెట్కు సమీపంలో ఉండటంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. నిర్మాణ అనుమతులు నిబంధనలకు అనుగుణంగా మంజూరయ్యాయా.. భవనం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయా అనే అంశాలను పిటిషనర్ ప్రశ్నించారు. మరోవైపు.. అవసరమైన అనుమతులు, ఎన్ఓసీ పొందినట్లు డెవలపర్ తరఫు న్యాయవాది తెలిపారు


