Dividend Stocks: స్టాక్ మార్కెట్లలో షేర్ల పెరుగుదలతోనే కాకుండా ఇతర రూపాల్లోనూ కంపెనీలు ఇన్వెస్టర్లకు ప్రయోజనం కల్పిస్తుంటాయి. ఇందులో ప్రధానంగా డివిడెండ్ల గురించి చెప్పుకోవాలి. ఒక్కో షేరుకు ఇంత చొప్పున అని చెల్లిస్తుంటాయి. ఈ డబ్బులు షేరు ధరతో సంబంధం లేకుండా నేరుగా సదరు ఇన్వెస్టర్ అకౌంట్లోనే జమవుతాయి. ఇప్పుడు దాదాపు 38 కంపెనీల వరకు డివిడెండ్ ప్రకటించగా దీనికి శుక్రవారం రికార్డు డేట్‌గా ఉంది. సెబీ నిబంధనల ప్రకారం గురువారమే షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


