2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటంపై టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ స్పందించాడు. 2027 అక్టోబర్ ఇంకా చాలా దూరంలో ఉందని, ఆ సమయంలోనే దాని గురించి ఆలోచిస్తానని పేర్కొన్నాడు. మరోవైపు రోహిత్ రిటైర్మెంట్పై వస్తున్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. ఇంగ్లాండ్‌పై 138 పరుగుల సెంచరీతో రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, అనవసర ఊహాగానాలు వద్దని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో భారత్ వన్డే సిరీస్ ఆడనుంది.


