15 నుంచి 18 సంవత్సరాల వయసు అనేది ఏ పిల్లల జీవితంలోనైనా అత్యంత కీలకమైన, సున్నితమైన దశ. ఈ వయసులో పిల్లలు అటు చిన్నపిల్లలుగా ఉండలేరు, ఇటు పూర్తిగా పెద్దవారూ (అడల్ట్స్) కాలేరు. ఒకవైపు కెరీర్, బోర్డ్ ఎగ్జామ్స్ టెన్షన్.. మరోవైపు శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులు, ఫ్రెండ్స్ నుంచి వచ్చే ఒత్తిడి. ఇలాంటి సమయంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదిగిపోయారని, వారికి ఇక తమ అవసరం పెద్దగా ఉండదని భావిస్తుంటారు. కానీ అసలు వాస్తవం దీనికి పూర్తిగా విరుద్ధం.
చైల్డ్ సైకాలజీ నిపుణుల ప్రకారం ఈ వయసులోనే పిల్లలకు తల్లిదండ్రుల గైడైన్స్, భావోద్వేగ మద్దతు చాలా అవసరం. ఈ వయసులోనే పిల్లలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అయితే, వారితో మాట్లాడటం ఎలా మొదలుపెట్టాలి, ఎలాంటి ప్రశ్నలు అడగాలి అన్న విషయంలో తల్లిదండ్రులు కన్య్పూజ్ అవుతుంటారు. అయితే, పిల్లలతో స్నేహపూర్వక బంధాన్ని ఏర్పరుచుకోవడానికి తల్లిదండ్రులు అడగాల్సిన ఐదు ప్రశ్నలేంటో ఇప్పుడు చుద్దాం.


