ఇంజినీరింగ్ విద్యార్థులు పొలాల్లో రాత్రి పూట మందు పార్టీ చేసుకుంటుండగా.. పోలీసుల పెట్రోలింగ్ వాహనం అటుగా వస్తోంది. దీంతో భయపడిపోయిన వారు.. పోలీసులకు దొరక్కూడదనే పరుగులు తీశారు. కానీ, ఇదే ఓ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. అడవి పందుల నుంచి పంటను కాపాడుకోడానికి ఓ రైతు తన పొలానికి పెట్టిన ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వారికి తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురైన ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులో శనివారం తెల్లవారుజామున జరిగినట్టు పోలీసులు తెలిపారు.


