న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత పేసర్ అర్షదీప్ సింగ్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 150 వికెట్లు మైలురాయిని అందుకున్న తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్సర్ను ఔట్ చేయడం ద్వారా అర్షదీప్ తన 150వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. కేవలం 103 మ్యాచ్‌లలో, అరంగేట్రం చేసిన 1,577 రోజుల్లోనే ఈ రికార్డు సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.


